నరసింహపురం పాఠశాలలో శక్తి యాప్‌పై అవగాహన సదస్సు

SKLM: నరసన్నపేట(M) వరాహ నరసింహపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం టెక్కలి సబ్ డివిజన్ శక్తి టీం సభ్యులు నారాయణరావు, విజయలక్ష్మి ఆధ్వర్యంలో శక్తి యాప్ అవగాహన సదస్సు నిర్వహించారు. హెల్ప్ లైన్ సెంటర్ నెంబర్లు, శక్తియాప్ డౌన్లోడ్, విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ, సైబర్ క్రైమ్, గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ మొదలగు వాటి గురించి అవగాహన కల్పించారు.