'చదువుకుంటే ఉజ్వల భవిష్యత్'

'చదువుకుంటే ఉజ్వల భవిష్యత్'

SRD: విద్యార్థులు కష్టపడి చదువుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. విద్య సమాజ అభివృద్ధికి మూలమని పేర్కొన్నారు. విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని పేర్కొన్నారు.