ద్వారకా తిరుమల బోర్డు సభ్యురాలికి సన్మానం
E.G: ద్వారకాతిరుమల దేవస్థానం బోర్డు సభ్యురాలిగా కడియం సత్యవతి నియమితులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెను ఎన్డీఏ కూటమి నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. దుద్దుకూరు గ్రామానికి చెందిన ఆమె భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత వెంకటేష్, శ్రీనివాస్, జనసేన గ్రామ అధ్యక్షుడు సంబబాల శ్రీనివాస్ ఉన్నారు.