భూములు లాక్కోవడం తప్ప అభివృద్ధి శూన్యం: ఎమ్మెల్యే
SRD: కాంగ్రెస్ ప్రభుత్వంలో భూములు లాక్కోవడం తప్ప అభివృద్ధి శూన్యమని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మాజీ సీడీసీ ఛైర్మన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బుచ్చిరెడ్డి అన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి మండలం, కంది మండలం, కొండాపూర్ మండలానికి సంబంధించిన రూ.21 లక్షల 33వేల విలువ చేసే CMRF చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.