ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలు.. ఎక్కడ ఎన్ని..?

HYD: రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు HYD జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు గాను 2 చోట్ల, రంగారెడ్డి జిల్లాలోని 14 కార్యాలయాలకు 3 చోట్ల, మేడ్చల్ జిల్లాలోని 12 కార్యాలయాలకు 3 చోట్ల ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనాలు నిర్మించనున్నారు. ఇవి కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు.