మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో బారులు తీరిన భక్తులు
MDCL: అల్వాల్ పట్టణం కనజగూడలోని మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి దేవాలయంలో ఉగాది పండుగ సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు దర్శనం కోసం బారులు తీశారు. అనంతరం తీర్థ ప్రసాదాలతో పాటు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఆలయ అభివృద్ధికి భక్తులు సహకరించాలని నిర్వాహకులు కోరారు.