డీహైడ్రేషన్‌తో వ్యక్తి మృతి
ADB: లక్షట్టిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కాండ్రాపు తరుపతి అనే వ్యక్తి అతిగా మద్యం తాగి డీహైడ్రేషన్‌తో మృతి చెందాడు. ఎస్సై గోపతి సురేష్ వివరాల ప్రకారం నాలుగు రోజుల క్రితమే చనిపోయినట్లు చెప్పారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండి దుర్వాసన రావడంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో విషయం తెలిసింది. మానసిక ఒత్తిడే మృతికి కారణం అని భావిస్తున్నారు.