ఆత్మహత్య చేసుకున్న యువకుడు

ఆత్మహత్య చేసుకున్న యువకుడు

WNP: ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. ఆత్మకూరు వాసీ మహేశ్ మదనాపురం మండలం రామన్ పాడ్ వద్ద ఉన్న పోచమ్మ గుడి దగ్గర పట్టాలపై వస్తున్న రైలుకు ఎదురు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మరణానికి కుటుంబ సమస్యలే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.