VIDEO: పోటెత్తిన భక్తులు.. భారీగా వ్రతాలు
SDPT: వర్గల్ మండలం నాచగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కార్తీక మాసం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్తీక మాసం పురస్కరించుకొని భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలను పెద్ద ఎత్తున జరుపుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.