'ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్‌పై అవగాహన సదస్సు'
E.G: ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2026 నిర్వహణపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడం జరిగిందని జోన్–1, జోన్–2 ప్రాంతీయ సంయుక్త సంచాలకులు టీ.శేఖర్ బాబు తెలిపారు. సోమవారం రాజమండ్రిలోని SKR మహిళా కళాశాలలో ఇంటర్మీడియట్ విద్య 2025–26 పరీక్షల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.