విదేశీ విద్యార్థులను వద్దనుకోవడం లేదు: ట్రంప్
అమెరికాలో విదేశీ విద్యార్థులు చదువుకునేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. వారు రావడం అమెరికాలోని వ్యాపారులకు మంచిదేనన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చే వారి సంఖ్య సగానికి తగ్గించకూడదని.. అదే జరిగితే మన విశ్వవిద్యాలయ, కళాశాల వ్యవస్థ నాశనం అవుతుందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో తను అలా జరగనివ్వనని స్పష్టం చేశారు.