బీజేపీపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు
AP: బీజేపీపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎప్పటికీ బీజేపీ బలపడదని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. కేవలం బీజేపీనే కాకుండా సనాతన ధర్మాన్ని కూడా ఉద్దేశిస్తూ ఉండవల్లి మాట్లాడారు. సనాతన ధర్మాన్ని బీజేపీయే నాశనం చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.