శ్రవణ్ రావుకు బిగ్ షాక్

శ్రవణ్ రావుకు బిగ్ షాక్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు శ్రవణ్ రావు బెయిల్ రద్దు చేయాలని సిట్ సుప్రీంకోర్టును కోరింది. విచారణకు సహకరించడం లేదని.. బెయిల్ రద్దు చేసి కస్టడీకి అప్పగించాలని సిట్ కోరింది. ఈ కేసులో శ్రవణ్ రావు విదేశాల నుంచి తిరిగి వచ్చి.. పూర్తి స్థాయిలో విచారణకు సహకరిస్తానని కోర్టుకు చెప్పాడు. కానీ తమకు సహకరించట్లేదని సిట్ తెలిపింది.