నందిగామకు కేంద్రీయ విద్యాలయం.. ఎమ్మెల్యే హర్షం వ్యక్తం

నందిగామకు కేంద్రీయ విద్యాలయం.. ఎమ్మెల్యే హర్షం వ్యక్తం

ఎన్టీఆర్: నందిగామ నియోజకవర్గ చరిత్రలో నేడు మరో సువర్ణాధ్యాయం రచించబడిందని ఎమ్మెల్యే సౌమ్య హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, నందిగామలో కేంద్రీయ విద్యాలయం తరగతుల ప్రారంభానికి కేంద్ర విద్యాలయ సంఘటన్ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయని ఆమె తెలిపారు.