జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి

E.G: నిడదవోలు SVD ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈనెల 9న జరిగే మెగా జాబ్ మేళా పోస్టర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. నిడదవోలు క్యాంపు కార్యాలయంలో మంత్రి దుర్గేశ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. జాబ్ మేళాలో 45 కంపెనీలు పాల్గొంటాయని, 1302 మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. రూ. 12వేలు నుంచి 40వేలు వరకు జీతం ఉంటుందన్నారు. యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.