ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం: ఎమ్మెల్యే

ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం: ఎమ్మెల్యే

ASR: ఆదివాసీలకు స్పెషల్ డీఎస్సీ ప్రకటించాలని రెండో రోజు శనివారం కూడా అరకులోయలో రాష్ట్ర మన్యం బంద్ కొనసాగుతుంది. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం బంద్‌లో పాల్గొని, బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారు. జీవో నెంబరు-3కి ప్రత్యామ్నాయంగా మరో జీవో తీసుకురాకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.