నేడు స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమం

నేడు స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమం

VZM: ప్రతి నెల మూడో శనివారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పురపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై సిబ్బందితో ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు కలెక్టర్ రామ సుందర్ రెడ్డి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ నల్లనయ్య పాల్గొన్నారు.