సీసీ కెమెరాల అవశ్యకతపై పోలీసుల అవగాహన సమావేశం
WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో శనివారం వర్తకులతో జరిగిన సమావేశంలో ఏసీపీ మామునూరు వెంకటేష్ సీసీ కెమెరాల ప్రాధాన్యాన్ని వివరించారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకమని, నేరస్థుల గుర్తింపులో ఇవి 100 మంది పోలీసుల సమానంగా పనిచేస్తాయని తెలిపారు. షాపు యజమానులు కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సీఐ రాజగోపాల్ సిబ్బంది పాల్గొన్నారు.