చలివేంద్రాన్ని ప్రారంభించిన ఛైర్ పర్సన్

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఛైర్ పర్సన్

KMM: వైరా RTC బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ ఛైర్ పర్సన్ కాపా చంద్రకళ, మున్సిపల్ వైస్ ఛైర్మన్ కట్ల సంతోష్‌తో కలిసి శనివారం ప్రారంభించారు. ఎండలు మండిపోతున్న నేపథ్యంలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని ఆమె అన్నారు. వారితో పాటు డిపో ఎస్ఎం బాలబోయిన వెంకటేశ్వరరావు ఉన్నారు.