పేదలకు దుప్పట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ప్రకాశం: కనిగిరిలో షిరిడి సాయిబాబా దేవస్థాన కమిటీ పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం గురువారం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు షిరిడి సాయిబాబా దేవస్థానం కమిటీ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.