UPDATE: రోడ్డు ప్రమాదంలో గాయాలైన వ్యక్తి మృతి

SRCL: ఎల్లారెడ్డిపేట(M) రాచర్ల గొల్లపల్లిలో రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాలు ప్రకారం.. బాకూరుపల్లి తండాకు చెందిన రామావత్ బాల్య(70)ను శనివారం బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా.. హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.