నిలబడి భోజనం చేస్తున్నారా?
రోజూ నిలబడి భోజనం చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ నిల్చొని తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుందని చెప్తున్నారు. ఆహారం త్వరగా జీర్ణం కాక జీర్ణసమస్యలు వస్తాయి. కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఊబకాయానికి గురయ్యే అవకాశం ఉందట. కాబట్టి కూర్చొని నిదానంగా తినడం ఉత్తమం.