'బాలికల విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట'
ADB: వెనుకబడిన తరగతుల బాలికలకు నాణ్యమైన విద్యను అందించి, వారిని ఉన్నత శిఖరాలకు చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' సంక్షేమ వారోత్సవాలలో భాగంగా తాంసి మండలం బండల్ నాగాపూర్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. కార్పొరేట్ స్థాయి విద్యతోపాటు మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు.