వచ్చే నెల 2న ధర్నా
AKP: అచ్యుతాపురం మండలంలో అపరిస్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం వచ్చే నెల రెండవ తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు, మండల కన్వీనర్ ఆర్ రాము తెలిపారు. ధర్నాపై గురువారం అచ్యుతాపురంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు.