'నియోజకవర్గాన్నిఅన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తా'

NLG: దేవరకొండ మండలం శకృతండాలో రూ.10లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు, మైనంపల్లిలో సీసీ రోడ్డును ఎమ్మెల్యే బాలునాయక్ బుధవారం అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. దేవరకొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. స్థానిక నాయకులు రాంసింగ్, తదితరులున్నారు.