ఆన్‌సైట్ FIR విధానాన్ని దుర్వినియోగం చేయవద్దు: ఎస్పీ
ASF: ఆన్‌సైట్ FIR విధానాన్ని దుర్వినియోగం చేయవద్దని ఆసిఫాబాద్ SP నితిక పంత్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. అవకాశం ఉందని ప్రతి దానికి ఇంటి వద్దకు పిలిపించుకోవద్దని సూచించారు. ఇంట్లోంచి బయటకు రాలేని వారు, అనారోగ్యంతో ఉన్న వారు, వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఫిర్యాదు చేసేందుకు పోలీసు శాఖ ఆన్‌సైట్ FIR విధానాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు.