ఎలుగుబంటి సంచారం.. భయాందోళనలో ప్రజలు

ఎలుగుబంటి సంచారం.. భయాందోళనలో ప్రజలు

JN: రఘునాథపల్లి మండలంలోని కంచనపల్లిలో క్రూర జంతువులు సంచరించడం కలకలం రేపుతుంది. గ్రామ శివారులో బుధవారం తెల్లవారుజామున ఎలుగుబంటి సంచరించినట్లు స్థానికులు తెలిపారు. మొన్న పులి, నేడు ఎలుగుబంటి రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.