'ఆలయ నిర్మాణాలకు దరఖాస్తులు చేసుకోండి'
TPT: టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో గ్రామాల్లో భజనమందిరాల నిర్మాణంకోసం దరఖాస్తులు చేసుకోవాలని శుక్రవారం దేవాదాయ శాఖ తెలిపింది. దేవాలయ నిర్మాణ స్థలం ఆధారంగా మందిరాలను టైప్ A, B, Cలుగా విభజించి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.