మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

JGL: ఇబ్రహీంపట్నం మండలం గోదూర్ గ్రామానికి చెందిన బురం దేవదాస్ (50) ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. కొన్నేళ్ల క్రితం గల్ఫ్ దేశానికి వెళ్లిన ఆయన 2 నెలల క్రితం ఇంటికి తిరిగి వచ్చాడన్నారు. తన పిల్లలకు వివాహం చేయలేనని మనస్తాపం చెంది, భార్యతో గొడవపడి ఎలుకల మందు తాగి చనిపోయాడని చెప్పారు. అతడి భార్య రాజమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.