విజయవాడ పార్లమెంట్ వైసీపీ పరిశీలకుడిగా వేణుగోపాల్ రెడ్డి

విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడిగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని ఆ పార్టీ అధినేత జగన్ మంగళవారం నియమించారు. 2014లో టీడీపీ నుంచి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా గెలుపొందిన మోదుగుల 2019లో వైసీపీలో చేరి గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓటమి చవి చూశారు. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్‌గా దేవినేని అవినాశ్ ఉన్నారు.