ఇఫ్తార్ విందుకు హాజరైన కవిత
HYD: మతసామరస్యానికి ప్రతీకగా రంజాన్ పర్వదినాన్ని జరుపుకోవడం సంతోషకరమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. వారసిగూడలో జరిగిన ఇఫ్తార్ విందుకు కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ముస్లింలకు రంజాన్ అనేది పవిత్ర మాసమని ఈ మాసంలో చేసే ఉపవాస దీక్షలు గొప్పవని అన్నారు. హిందూ ముస్లింలు సోదర భావంతో ఇఫ్తార్ విందులకు హాజరు కావడం మంచి సాంప్రదాయమన్నారు.