ఉన్నత విద్యపై మంత్రి లోకేష్ ప్రత్యేక దృష్టి
GNTR: మంత్రి లోకేష్ ఉన్నత విద్యపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇవాళ సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో వర్సిటీలకు సంబంధించిన యూనిఫైడ్ యాక్ట్‌ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులోగా ITIలు, వర్సిటీలను పరిశ్రమలతో అనుసంధానించి, KG-PG వరకు సమర్థవంతమైన స్టూడెంట్ ట్రాకింగ్ వ్యవస్థను రూపొందించాలన్నారు. వర్సిటీలు, IIITల్లో 100% ప్రాంగణ నియామకాలు చేపట్టాలని సూచించారు.