'సమగ్రాభివృద్ధి సాధనకై పయనిద్దాం'

కృష్ణా: నూజివీడు నియోజకవర్గంలో అన్ని రంగాలలో సమగ్రమైన అభివృద్ధి సాధించాలని లక్ష్యంతోనే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారని మాజీ శాసనసభ్యులు చిన్నం రామకోటయ్య తెలిపారు. సోమవారం చాట్రాయిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గడచిన రెండు దఫాలుగా ఒకే పార్టీ ఒకే అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుస్తున్నప్పటికీ నియోజకవర్గంలో పెద్దగా సాధించింది ఏమీ లేదన్నారు.