108 అంబులెన్స్ అత్యవసర సేవలపై కేంద్ర కమిటీ తనిఖీ
SRD: మండల కేంద్రమైన కంగ్టిలోని 108 అంబులెన్స్ వాహనం అత్యవసర సేవలపై కేంద్ర ఆరోగ్య బృందం సోమవారం తనిఖీ చేసింది. స్టేట్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సంతోష్, రంజాన్ దాస్‌లు అంబులెన్స్ వాహనంలో అత్యవసర సేవల పరికరాలు, ఆక్సిజన్ వాటి ఉపయోగం, EMTల పనితీరు పై పరిశీలించారు. ఇందులో 108 సిబ్బంది సంగ్ శెట్టి, వసంత్ ఉన్నారు.