షరతులు లేకుండా రైతులకు సరిపడా యూరియా అందించాలి: CPM

KMM: ఎలాంటి షరతులు లేకుండా రైతులకు సరిపడా యూరియా అందించాలని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి, మడుపల్లి గోపాలరావు అన్నారు. యూరియా సమస్యను పరిష్కరించాలని కోరుతూ శనివారం మధిర సొసైటీ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.