కోర్టు భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
SRPT: కోదాడ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న కోర్టు భవన నిర్మాణ పనులను ఇవాళ కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్, అడ్వకేట్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ భవన నిర్మాణానికి ఐదు కోట్ల నిధులు విడుదల చేయనున్నట్లు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తెలిపారు.