ట్రాక్టర్ బోల్తా ఘటనలో మరో కార్మికుడు మృతి

ట్రాక్టర్ బోల్తా ఘటనలో మరో కార్మికుడు మృతి

అన్నమయ్య: రైల్వే కోడూరు నియోజకవర్గం వెలగచర్ల గ్రామంలో ఉపాధి హామీ పనులకు వెళ్తున్న కార్మికులతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో మరో కార్మికుడు మృతి చెందాడు. గాయపడిన పగడాల పెంచలయ్యను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తిరుపతి మారుతీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.