హనుమాన్ మందిరానికి మాజీ మంత్రి విరాళం

హనుమాన్ మందిరానికి మాజీ మంత్రి విరాళం

ADB: జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ శ్రీ హనుమాన్ ఆలయాభివృద్ధికి బుధవారం మాజీ మంత్రి జోగు రామన్న రూ.20 వేలు విరాళం అందించారు. ఈ సందర్భంగా జోగు ఫౌండేషన్ సభ్యులు కలిసి ఆలయ కమిటీ నాయకులకు నగదును అందించారు. దీంతో కమిటీ సభ్యులు మాజీ మంత్రి రామన్నకు కృతజ్ఞత తెలిపారు. కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.