గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

నంద్యాల పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మంత్రి ఎన్ఎండీ ఫారుక్ ప్రజా గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన అర్జీలకు చట్టపరిధిలో పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశించారు.