ముమ్మరంగా శానిటేషన్ పనులు
AKP: సీఎం చంద్రబాబు ఈనెల 23న రాంబిల్లి మండలంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ముమ్మరంగా శానిటేషన్ పనులు చేపట్టారు. ముఖ్యమంత్రి బహిరంగ సభ సమీప ప్రాంతంలో నిర్వహిస్తున్న శానిటేషన్ పనులను కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్, డిప్యూటీ ఎంపీడీవో కూర్మారావు పర్యవేక్షిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పరిశుద్ధ సిబ్బందిని రప్పించి రోడ్లను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నారు.