పోలింగ్ స్టేషన్ల తుది జాబితా విడుదల

పోలింగ్ స్టేషన్ల తుది జాబితా విడుదల

WGL: వర్ధన్నపేట పట్టణంలోని 12 వార్డులకు సంబంధించిన 20 పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను సిద్ధం చేసి శుక్రవారం విడుదల చేసిన మున్సిపల్ కమిషనర్ సుధీర్ కుమార్.ఈ జాబితాను వరంగల్ ఆర్‌డీవో కార్యాలయం, వర్ధన్నపేట తహసీల్దార్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయ నోటిస్ బోర్డులపై ప్రదర్శించినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ప్రజలు ఈ సమాచారాన్ని గమనించాలని ఆయన కోరారు.