నేటి నుంచి వీరభద్రస్వామి జాతర ఉత్సవాలు
SRD: రాయికోడ్‌లోని వీరభద్రస్వామి దేవాలయ జాతర ఉత్సవాలు ఈ నెల 11వ తేదీ వరకు వైభవంగా కొనసాగుతాయని ఆలయ కమిటీ ఛైర్మన్ కులకర్ణి సతీశ్, ఈవో శివ రుద్రప్ప తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం, భద్రకాళి సమేత వీరభద్ర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, మహిళలతో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.