రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

GNTR: పొన్నూరు మండలం నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఇవాళ జరిగిన రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు బాపట్ల రైల్వే పోలీస్‌ ఎస్సై దేవమ్మ తెలిపారు. రైలు ఢీకొనడంతో మృతదేహం తీవ్రంగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.