VIDEO: ఎమ్మిగనూరులో కార్డెన్ సెర్చ్.. 15 వాహనాలు స్వాధీనం

KNRL: ఎమ్మిగనూరులో డీఎస్పీ భార్గవి నేతృత్వంలో నిన్న పట్టణంలోని లక్ష్మీపేట, సంజీవనగర్, ఎంఎస్ నగర్, ఎస్సీ కాలనీ, క్రాంతి నగర్ వంటి ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రౌడీషీటర్లు, అనుమానితుల ఇళ్లలో సోదాలు జరిపి, పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల పత్రాలు చూపని వారిపై చర్యలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు.