19 నుంచి చైత్ర మాస వసంత నవరాత్రోత్సవాలు

19 నుంచి చైత్ర మాస వసంత నవరాత్రోత్సవాలు

KNR: కరీంనగర్ రూరల్ మండలం నగునూరు‌లోని శ్రీ దుర్గాభవానీ ఆలయంలో ఈ నెల 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు చైత్ర మాస వసంత నవరాత్రోత్సవాలు జరుగుతాయని ఆలయ ఫౌండర్, ఛైర్మన్ వంగల లక్ష్మణ్ తెలిపారు. ఈ నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు ఉ. 8.30 గం.లకు, సా. 7 గం.లకు విశేష హారతి, పూజలు జరుగుతాయని అన్నారు. వసంత నవరాత్రి ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.