కరీంనగర్‌లో ఈనెల 19న జాబ్ మేళా
KNR: జిల్లాలోని నిరుద్యోగులకు ఈనెల 19న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి వై. తిరపతి రావు తెలిపారు. కరీంనగర్ అటోమోటివ్స్ సంస్థలో 20 పోస్టులున్నాయని, ఏదేని డిగ్రీ ఉండి వయస్సు 20-40 లోపు గల వారు అర్హులని కోరారు. వేతనం 14000 నుంచి 35000 (పురుషులు మాత్రమే) ఆసక్తి గల వారు 19న పేరు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.