VIDEO: MG రోడ్‌లోని దుకాణాల్లోకి వర్షపు నీరు

MDK: మెదక్ పట్టణంలో గురువారం భారీ వర్షం కురిసింది. ప్రతిసారీ లాగే ఈసారి కూడా వర్షపు నీరు MG రోడ్‌లోని దుకాణాల్లోకి ప్రవహించి వ్యాపారులకు ఇబ్బందులు కలిగిస్తోంది. వర్షం కారణంగా రహదారులు జలమయంగా మారగా, వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికులు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని అధికారులు కోరుతున్నారు.