మున్సిపల్ కార్యాలయంకు భారీ నిధులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కార్యాలయం అభివృద్ధికి రూ. 50 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. వేసవిలో తాగునీటి సమస్యలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.