విషాదం.. చెట్టుమీద పడి వ్యక్తి మృతి

విషాదం.. చెట్టుమీద పడి వ్యక్తి మృతి

జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జహీరాబాద్ మండలంలో ఓ వ్యక్తిపై చెట్టు పడి మృతి చెందాడు. షేఖాపూర్‌ గ్రామానికి చెందిన అశోక్(30) అనే వ్యక్తి గురువారం చెట్లు నరికేందుకు పనికి వెళ్లాడు. గ్రామ శివారులో చెట్లు నరుకుతుండగా ప్రమాదవశాత్తు చెట్టు తలపై పడి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.