రెల్లిలో పొలం పిలుస్తోంది కార్యక్రమం

VZM: కొత్తవలస మండలం రెల్లి రైతు సేవ కేంద్రంలో రైతులకు మండల వ్యవసాయ అధికారి రాం ప్రసాద్ ఆద్వర్యంలో పొలం పిలుస్తోంది బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వర్షాలు అధికంగా పడడంవలన, వరి పంట ఆశాజనకంగా ఉందని, యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. దానిని విడతల వారీగా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. రైతులు ఆందోళన చెందనవసరం లేదన్నారు.